వైద్యుడి నిర్వాకం బాలింత మృతి

Share this:

నాగర్ కర్నూల్(V3News) 01-06-2022: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సత్య సాయి నర్సింగ్ హోమ్ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్వాకంతో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ ప్రసవానంతరం బాబు జన్మించగా బాలింత మృత్యువాత పడింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన శ్రీజ(22) ప్రసవం కోసం మంగళవారం ఆసుపత్రికి చేరింది. మృతురాలి తల్లి మంగళవారం వద్దు మా వద్ద డబ్బులు లేవు అని చెప్పినా డాక్టరు ఈరోజు తప్పితే నేను చెయ్యను అని బలవంతం చేయడంతో గత్యంతరం లేక వైద్యం చేసేందుకు ఒప్పుకున్నారు . పురిటి నొప్పులు రావడంతో అన్ని పరీక్షలు జరిపిన వైద్యుడు సిజేరియన్ చేశారు. కాన్పులో బాబు జన్మించగా తల్లి పరిస్థితి హై బిపితో విషమించింది. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేయగా మార్గమధ్యలోనే మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి పురిటినొప్పులు లేకున్నా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ కూతురిని పొట్టనపెట్టుకున్నాడని మృతురాలి తల్లి మమత ఆరోపించారు.

Leave a Reply