మొదలైన ‘ప్రైవేట్’ వ్యాపారం.. చదువు తక్కువా ఫీజులెక్కువా ?

Share this:

పాఠశాలల్లో బడి గంట మోగింది. గంట శబ్దం విద్యార్థు ల్లో కొత్త ఉత్సాహం నింపుతుండగా.. వారి తల్లిదండ్రుల్లో మాత్రం వణుకు పు ట్టిస్తోంది

భైంసా(V3News) 08-07-2022: ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య ఒక టిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఒకవైపు కార్పొరేట్, ప్రైవేట్, సంస్థలు ఫీ’జులుం’ చూపిస్తూనే మరోవైపు ఇతర మార్గాల్లో కూడా డబ్బులు దండుకుంటున్నాయి. అడ్మిషన్ల టైం లోనే పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, షూలను విక్ర యిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడీతో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రుల జేబులు కాళీ చేస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్ అన్నీ ఇక్కడే తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు జేబులు ఖాళీ అవుతున్నాయి. పాత బకాయిలు, కరోనా సమయంలో పెండింగులో ఉన్న ఫీజులు సైతం వసూలు చేస్తున్నారు. చెల్లించని యెడల పుస్తకాలు ఇచ్చేది లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెండేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. జిల్లా విద్యాశాఖ, మండల అధికారులు కనీసం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంతో వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా గురువారం ఏబీవీపీ భైంసా శాఖ ఆధ్వర్యంలో పట్టణ meo సుభాష్ కి వినతిపత్రం అందజేశారు.

Leave a Reply