టెన్నిస్, వాలీబాల్ ఛాంపియన్ షిప్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి

Share this:

హసన్ పర్తి(V3News) 31-03-2022: హసన్ పర్తి మండలం కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జూనియర్ యూత్ ఇంటర్ డిస్టిక్ట్ టెన్నిస్, వాలిబాల్ చాంపియన్ షిప్ పోటీల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెరాస వరంగల్ జిల్లా అద్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మేల్యే అరూరి రమేష్ ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడాలలో కూడా రాణించాలని తెలిపారు.యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు.గెలుపు ఓటమి రెండు సమానంగా తీసుకోవాలని,గెలిచిన జట్టుకు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు,మండల ప్రజా ప్రతినిధులు, డివిజన్ నాయకులు, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply