కార్మిక హక్కుల కోసం కొట్లాడే నాయకుడు తోటి కార్మికురాలికి లైంగిక వేధింపులు

Share this:

గోదావరిఖని(V3News): కార్మిక హక్కుల కోసం కొట్లాడే నాయకుడు తోటి కార్మికురాలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ అధికారుల ముందు చెప్పు దెబ్బలు తిన్నా బుద్ది మారలేదు.రౌడీలను ఇంటి పైకి పంపించి భౌతిక దాడికి దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గోదావరిఖనిలో కలకలం రేపింది.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో స్వప్న అనే సింగరేణి కార్మికురాలు సహోద్యోగి లైంగిక వేధింపులు భరించలేక ఆర్జీ-1జీఎం కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భర్తను కోల్పోయి కారుణ్య నియామకాల్లో ఉద్యోగం సాధించిన స్వప్న తన కాళ్లపై నిలబడి పిల్లలను వృద్ధి లోకి తీసుకురావాలనుకుంది. ఉద్యోగంలో చేరిన నాటి నుండి స్వప్నకు అడుగడుగున అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయని కన్నీరు పెట్టింది. గతంలో సంస్థ నుండి రావలసిన డబ్బుల కోసం ఓ అధికారి ఇంటికి వచ్చి చెక్కు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేసాడని… ప్రస్తుతం పనిస్థలంలో ఫిట్ సెక్రెటరీ స్వామిదాస్ తన లైంగిక వాంఛను తీర్చాలంటు వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం రాత్రి స్వామిదాస్ అనుచరులు తన ఇంటి పైకి వచ్చి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా రాజీకి రాకపోతే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమే పేర్కొంది. ఆర్జీ-1 వర్క్ షాప్ లో విధులు నిర్వహిస్తున్న స్వప్నకు ఎటు చూసిన అవమానాలు ఎదురుకావడంతో నిస్సహాయ స్థితిలో జీఎం కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించింది. స్థానిక మహిళా సంఘాల నాయకులు, తోటి కార్మికులు ఆమెకు మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. స్వామి దాసు పై పోలీస్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply