పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి-పిడిఎస్‌యూ

Share this:

కొత్తగూడెం(V3News) 13-09-2022: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యూ ఆద్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు.. ఈసందర్బంగా PDSU జిల్లా కార్యదర్శి పృద్వి, రాష్ట్ర నాయకురాలు సంధ్య లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్కాలర్‌ షిప్‌, పీజురియంబర్స్‌మెంట్‌ రాక విద్యార్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.. విద్యార్దుల చదువులు పూర్తయినా పీజ్‌ రియంబర్స్‌మెంట్‌ రాక ప్రవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు సర్టిపికెట్స్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.. ప్రభుత్వం వెంటనే పీజ్‌రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు..