తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ‘సైకాన్-2022’

Share this:

గోదావరిఖని(V3News)06-05-2022: తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ‘సైకాన్-2022’ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించారు.! ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం అసోసియేషన్ పెద్దపెల్లి జిల్లా శాఖ అధ్యక్షులు మేజిక్ రాజా మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా సైకాలజిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు.! మే 5,2017లో డాక్టర్ మోతుకూరి రాంచందర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భవించిందని, లక్ష మంది కళాశాల విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపట్ల అవగాహన కలిగించి వరల్డ్ రికార్డ్ నెలకొల్పడం జరిగిందన్నారు.! ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 5 లక్షల మందికి మోటివేషన్ క్లాసులు నిర్వహించడం జరిగిందని, సైకాలజిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకై శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.! కరోనా కాలంలో 628 మంది కరోనా బాధితులకు మానసిక స్థైర్యాన్ని కలిగించామని, 120 ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు. అసోసియేషన్ గోదావరిఖని శాఖ సేవలను విద్యార్థులు, సమాజము వినియోగించుకోవాలని,స్వచ్ఛందంగా సేవలందించేందుకు తమ సభ్యులు సంసిద్ధంగా ఉన్నారన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో టిపిఏ కార్యవర్గ సభ్యులు భూమయ్య, సిహెచ్.పద్మజ,భీం సేన్, చంద్రపాల్, మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్షులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply