బాపట్ల ఫోటోగ్రాఫర్ పి. వి. యస్ నాగరాజు కు అంతర్జాతీయ పురస్కారం

Share this:

బాపట్ల ఫోటోగ్రాఫర్ పి. వి. యస్ నాగరాజు కు అంతర్జాతీయ పురస్కారం ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫి,కౌన్సిల్ (IIPC)న్యూడిల్లి వారు ప్రకటించిన అంతర్జాతీయ పురస్కారం లభించింది. బాపట్ల జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ పవన్ డిజిటల్ స్టూడియో అధినేత పి .వి .యస్ నాగరాజు కు ఆర్టిస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫి, కౌన్సిల్ (AIIPC)హానర్ లభించింది. నాగరాజు నలుపు తెలుపు విభాగంలో పంపిన ఫోటోలకు న్యాయనిర్ణేతలు ముగ్ధులై ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని విజయవాడలో ని బాలోత్సవ్ భవన్ లో జరిగిన అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్ మరియు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ డైరెక్టర్‌ జే బీ రావు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా బాపట్ల ఫొటోగ్రాఫర్స్ నాగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, ఐఐపీసీ డిజిటల్‌, ఫొటో జర్నలిజం విభాగం చైర్మన్‌ తమ్మా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.