రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి

Share this:

హనుమకొండ :02-05-2022:తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా, వచ్చే నెల మే 6 వ తేదీన, హనుమకొండ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న రైతు సంఘర్షణ సభా ప్రాంగణాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ & మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ

ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా ఏ రకంగా పరిపాల చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారు చెప్పిన హామీలు మాటలు ఏవిధంగా నిలబెట్టుకున్నారో ? తెలంగాణా ప్రజలకు తెలుసు.
ప్రత్యేకంగా రైతుల పట్ల ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవరించిన విధానాలు ఏవిధంగా ఉన్నాయో మనకందరికీ తెలుసు.
ఎనిమిది ఏండ్లుగా రైతులు పంట పండక, పండిన పంటకు మద్దతు ధర లేక, కష్టపడి పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కెసిఆర్ , నరేంద్ర మోదీ లు అధికారంలోకి రాకముందు రైతుకి అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రవచనాలు పలికి ఇప్పుడు రైతు కంట్లో కన్నీరు పెట్టిస్తున్నారు.
మద్దతు ధర ఇచ్చి, పంట కొనాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఒకరి మిద ఒకరు ధర్నాలు చేస్కుంటుంటే, రైతులు ఎం చేయాలో దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలు మర్చి పోవాలనే ఉద్దేశంతో హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు రైతు బంధు పథకానికి తెర లేపింది.
కేవలం రైతు బందు పథకంతో అన్ని సరిపోతాయి అనుకున్నటువంటి ఆలోచనతో వారు ముందుకు సాగారు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత రైతు వందు పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
గత రెండు మూడు సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నాం వరి ధాన్యం కొనుగోలు పరిస్థిత ఏవిధంగా ఉంది.
తరుగు పేరు మీద మిల్లర్లు ఏవిధంగా రైతులను దోచుకుంటున్నారో మీకు తెలుసు
అదేవిధంగా IKP సెంటర్ల దగ్గరికి వచ్చిన తర్వాతః రైతులు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నారో, ఏవేమి పట్టనట్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఆనాడు సోనియా గాంధీ ఇదే మైదానంలో బిసి గర్జన పేరుతో బ్రహ్మాండమైన సభ నిర్వహించారు. ఆ సభ తర్వాతః కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని అదే స్పూర్తితో మే 6 న రైతులకు మద్దతుగా రైతు సంఘర్షణ సభ నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మళ్ళి అధికారం లోకి వస్తుందని అన్నారు.
60 ఏళ్ల తెలంగాణా ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, ఉద్యమ పార్టీగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఈ ఏడున్నర సంవత్సర కాలంలో తెలంగాణా ప్రజలను, రైతులను మహిళలను నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేసిందని అన్నారు.
ఇక్కడ బాగుపడ్డది కే.సి.ఆర్ కుటుంబం, తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేస్తానంటూ అప్పుల తెలంగాణాగా మార్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.
బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతుకు వెన్నెముకగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ మనం ఏదైనా సాధించుకోవాలన్న, దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్న ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వచ్చే నెల మే 6 వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు మేధావులు విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం మర్రి శశిధర్ రెడ్డి పిసిసి మాజీ అద్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ను హన్మకొండ రాంనగర్ లోని స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి రాహుల్ సభా ఏర్పాట్లపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, ఈ.వి. శ్రీనివాస్ రావు, టిపిసిసి అధకార ప్రతినిధి కూచన రవళి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మౌటం సత్యనారాయణ, సికింద్రాబాద్ నేతలు పురుర్వా రెడ్డి, ఎం.ఆర్. ప్రభాకర్, శీలం ప్రభాకర్, దయానంద్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి బొంత సారంగం, డివిజన్ అద్యక్షుడు వల్లపు రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply