పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఇమామ్ లు మరియు మౌజాన్ లకు రంజాన్ తోఫాలు

Share this:

బాపట్ల(v3News)01-05-2022: బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ వేగేశన నరేంద్రవర్మ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఇమామ్ లు మరియు మౌజాన్ లకు రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ ముస్లిం లు పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు నమాజులు చేపట్టి అల్లా కు అత్యంత ప్రీతిపాత్రులావుతారని అన్నారు.మసీదులోని ఇమామ్ లకు మౌజాన్ లకు రంజాన్ తోఫాలు అందజేయటం నా పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. కులమతాలకు తావులేకుండా అందరూ సోదరభావంతో ఉండాలని అలాగే అల్లా మన అందరికీ ఆయురారోగ్యాలు, సంతోషాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం ముస్లిం మైనారిటీ నాయకులు,ముస్లిం మతపెద్దలు ఇమామ్ లు,మౌజాన్ లు పాల్గొన్నారు.

Leave a Reply