ఆదివాసీల అస్తిత్వ రక్షణకై మారో పోరాటానికి సిద్ధం కండి-ఆదివాసీ సేన

Share this:

గూడిహత్నూర్: ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి పిలుపు నిచ్చారు… అదిలాబాద్ జిల్లా గూడిహత్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ సేన అధ్వర్యంలో… ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో 82వ కుంరం భీం వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలథ్ రావు పాల్గొని మాట్లాడారు… ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జిలు రాయిసిడం జంగుపటేల్, పేందోర్ విశ్వనాథ్, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మణ్, ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కుంరం దశరథ్, ఆదివాసీ రైతు సేన జిల్లా అధ్యక్షులు తోడషం భూమ పటేల్, తోటి సంఘం జిల్లా అధ్యక్షులు మేస్రం నారాయణ,ఆదివాసీ సేన మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు