గోకారం రిజర్వాయర్ పనులను ముంపు బాధితులకు నష్టపరిహాన్ని చెల్లించకపోతే రిజర్వాయర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష -మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

Share this:

  • నాలుగేళ్లు గడుస్తున్న గోకారం రిజర్వాయర్ని పట్టించుకోని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
  • ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప పథకాలను అందిస్తున్న నాలుగేళ్లుగా రిజర్వాయర్ పూర్తి కాకపోవడంలో ఎవరి లోపం
  • కల్వకుర్తి ప్రజలను ఇబ్బందుల గురిచేస్తే చూస్తూ ఊరుకోను మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

కల్వకుర్తి చారకొండ: కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో గోకారం రిజర్వాయర్ సంబంధించిన రిజర్వాయర్ పనులను మాజీ మంత్రి అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కలిసి పర్యవేక్షించారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ నేటికి ప్రారంభించి 4 సంవత్సరాలు అయినప్పటికీ రైతులకు పొలాలు టెండర్లు వేసి ఆక్రమించిన ప్రభుత్వం అధికారులు నేటికీ సరైన పరిహారం చెల్లించక రైతులు ఆందోళనకుచెందుతున్నారు.చంద్రాన్ పల్లి,గోకారం గ్రామానికి సంబంధించిన 500 మత్సకారుల కుటుంబాలు 4 సంవత్సరాలుగా ఎలాంటి జీవనాధారం లేక సతమతం అవుతున్నారు అని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అధికారుల పై మండిపడ్డారు. అలాగే ఆ రిజర్వాయర్ సంబంధించిన ఎర్రవల్లి,తండా ముంపు గ్రామాలు కావడంతో వారు అక్కడినుండి వెళ్లాల్సిన అవసరం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కొంతమందికి ఎకరాకు ఐదున్నర లక్షలు ఇవ్వడంతో మాకు ఎటు సరిపోక ప్రభుత్వం మాకు కన్నీటి చుక్కలకు కరణమౌతుందని ఆవేదన వ్యక్తంతో ఉన్నామని కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ వారితో ప్రజలు వాపోయారు.మా రైతులకు అండగా నిలవడానికి
గోకారం రిజర్వాయర్ కు తీసుకున్న పొలాలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని కల్వకుర్తి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పరవేక్షించి రైతులకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కల్వకుర్తి తాలుకా అభివృద్ధి సాధన కమిటీకి ప్రజలు ఉమ్మడి అంధ్రప్రదేశ్ మాజీమంత్రి వర్యులు జక్కుల చిత్తరంజన్ దాస్ కు రైతులు తెలిపారు.సమావేశంలో అధికారుల పై స్థానిక నాయకులపై ప్రజాసమస్యలు తెలుసుకొని వారి వారి అవసరాలను తీర్చుతూ ముందుకు పోవడమేలక్ష్యంగా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల కోసం అనేక పథకాలు అందిస్తున్న కానీ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజల గోడును పట్టించుకునే అధికారులు లేక ప్రజాప్రతినిధులు చూసి చూడనట్టు వ్యవహరించడం మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే గోకారం రిజర్వాయర్ ప్రారంభించి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోతే రిజర్వాయర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన తెియజేశారు. ఈ రిజర్వాయర్ పనులపై ముంపు బాధితుల నష్టపరిహారం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించి గోకారం రిజర్వాయర్ మునుపు బాధితులకు న్యాయం చేయిస్తానని అక్కడి ప్రజలకు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటి తాలుకా అధ్యక్షుడు సుద్ధపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్,ముదిరాజుల తాలూకా అద్యక్షుడు పుట్ట శేఖర్,సాధన కమిటీ గౌరవ కార్యదర్శులు మండల నాయకులు మహిళ విభాగం నాయకురాలు సభ్యులు గోకరం సర్పంచ్ భాస్కర్ రెడ్డి,ఉపసర్పంచు,భాస్కరచారి,చంద్రాంపల్లి,ఉలసర్పంచు,పర్వతాలు,తాలూకా మాస్త్యుకారులు అధ్యక్షుడు,పుట్ట శేఖర్,సోప్పరి వెంకటయ్య,మోర సత్యం,జమ్ముల శంకర్,శంకర్,జగత్ రెడ్డి,దామర్ల కృష్ణన్న,లక్మరెడ్డి,ఎర్రవల్లి మాజీ సర్పంచు అంగోతు గోజి రెడ్యానాయకు,మాజీ వార్డు సభ్యుడు శ్రీను,బలరాం,మొత్య నాయక్,వెంకటయ్య,పైలెట్ వివిధ గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు