ఊపిరి పీల్చుకున్న కడెం…..

Share this:

నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్ట్ ప్రమాదం తప్పింది..

కడెం ప్రాజెక్టు గత రెండు రోజులనుండి వరద నీరు పోటెత్తడంతో డ్యాం ప్రమాద అంచుకు చేరుకున్న విషయం తెలిసిందే మూడు రోజులగా మంత్రి i k రెడ్డి, అధికారులు, ఎమ్మెల్యే, కలెక్టర్, అక్కడే ఉంటు పరిస్థితులను సమీక్షించారు. పోలీసు సిబ్బంది మరియు స్థానిక నాయకులు తన అనుచరులతో అంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
నేటి ఉదయం ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ప్రోజెక్టు ను సందర్శించారు. అనంతరం కడెం పట్టణంలో నీట మునిగిన గృహాలను, వ్యాపార సముదాయాలను పరిశీలించారు .బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం డ్యాం పై ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేవుడి దయ వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రస్తుతం డ్యాం పరిస్థితి చాలాబాగుంది అని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు మరియు పోలీస్ అధికారులు చాలా అద్భుతంగా పని చేశారని వారిని అభినందించారు. స్థానికులు మాట్లాడుతూ నిన్నటి నుండి మంత్రి వర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరుఖి గార్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ డ్యాం పై స్వయంగా పై కి వెళ్లి పరిశీలించారు అని వారు కొనియాడారు

Leave a Reply