అంగరంగ వైభవంగా ధర్మారం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ పట్నాలు

Share this:

గీసుకొండ(V3News): గ్రేటర్ వరంగల్ 16 డివిజన్ గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో గత వారం రోజుల నుంచి సప్రాపాద రేణుకా ఎల్లమ్మ విగ్రహ పునః ప్రతిష్టా కార్యక్రమాలు ఆలయ కమిటీ నిర్వాహకులు,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు డప్పు చప్పుళ్ళతో బోనాలు,పట్నాలతో కోళ్లు,యాటపిల్లలతో దేవాలయానికి తరలివచ్చి ఎల్లమ్మ తల్లికి భక్తిశ్రద్దలతో మొక్కులు చెల్లించారు.రేణుకా ఎల్లమ్మ తల్లికి మేక పోతులను బలి ఇచ్చారు.ధర్మారం గ్రామంలో మంగళవారం పండుగ వాతావరణం ఏర్పడింది.రేణుకాఎల్లమ్మ దేవత అనుగ్రహంతో గ్రామస్థులు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని రేణుకా ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు,భక్తులు మీడియాకు తెలిపారు.అనంతరం గ్రామంలో గ్రామస్థులు పసందైన విందు చేసుకున్నారు.

Leave a Reply