చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నకు తోడుగా ఉంటా -పర్యాటక శాఖ మంత్రి ఆర్కేరోజా

Share this:

నగరి (v3news) 19-04-2022: రాష్ట్ర కేబినెట్‌లో పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖా మంత్రిగా చివరి రక్తపు బొట్టు వరకు జగనన్నకు తోడుగా ఉంటానని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఆమెకు పార్టీ నాయకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ ర్యాలీలో భాగంగా నగరి టవర్‌క్లాక్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రిగా అవకాశం కల్పించారని ఆ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చేవిదంగా చేసి రాష్ట్ర ప్రగతికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానన్నారు. అను నిత్యం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకోసం ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరూ లేరన్నారు. కేబినెట్‌లో మంత్రి పదవుల కేటాయింపే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నాయంటేæ అవి ఎంత మహత్తరమైనవో అర్ధం చేసుకోవాన్నారు. అలాంటి పథకాలు ప్రవేశ పెట్టి నిరంతరం ప్రజలకోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని తన చివరి రక్తపు బొట్టు వరకు బలపరుస్తూ ఒక సైనికురాలిగా పనిచేస్తానని వాగ్దానం చేశారు. ఇదివరకు ఎమ్మెల్యే అని ప్రస్తుతం మంత్రి కనుక బాధ్యతలు పెరిగిందని తదనుగుణంగా పనిచేస్తానన్నారు. తొలుత నగరి ఓంశక్తి గుడి వద్ద వైఎస్సార్‌ విగ్రహానకి పూలదండలు వేసి ఓంశక్తి దేవాలయంలో పూజలు చేశారు. సమావేశానంతరం ఓంశక్తి ఆలయంలో పూజలు చేసి ఆలయ మర్యాదలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ వీవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆర్కేసెల్వమణి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, మొదలియార్‌ కార్పొరేషన్‌ డైర్టెక్టర్‌ బాలకృష్ణ, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైర్టెక్‌ మాహిన్, సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ శ్యామ్‌లాల్, పుత్తూరు మునిసిపల్‌ చైర్మన్‌ హరి, పార్టీ నాయకులు కుమారస్వామి రెడ్డి, రామ్‌ప్రసాద్‌ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply