సీపీఐ నారాయణను పరామర్శించిన పర్యాటకమంత్రి ఆర్కే రోజా

Share this:

నగరి :. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతీదేవి మృతిచెందిన విషయం విధితమే. సతీవియోగంతో బాథపడుతున్న నారాయణను రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కతిక శాఖా మంత్రి ఆర్కేరోజా పరామర్శించారు. శుక్రవారం మండలంలోని అయనంబాకం గ్రామంలోగల ఆయన స్వగహానికి చేరుకున్న ఆమె నారాయణను పరామర్శించారు. ఆయన సతీమణి వసుమతీ దేవి చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి నివాళులర్పించారు. ఆమె వెంట సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర రెడ్డికార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, ఎంపీపీ భార్గవి, జడ్పీటీసీ గాంధీ, వైస్‌ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్ప, కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ తిరుమలరెడ్డి, నాయకులు బీడీ భాస్కర్, ఇంద్రయ్య, వైస్ చైర్మన్ బాలన్ .మృగ రెడ్డి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు . సచివాలయం సిబ్బంది వాలంటరీ. పాల్గొన్నారు.

Leave a Reply