ఇష్టారాజ్యంగా రోడ్డు తవ్వకాలు-48 గంటల్లో v3 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు

Share this:

నీటి సరాఫరాను పునర్ధించిన అధికారులు

మంత్రి జగదీష్ రెడ్డికి, v3 న్యూస్ కి, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన స్థానిక ప్రజానీకం

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుండి ఎస్వి ఇంజనీర్ కళాశాల వరకు పలు జంక్షన్ల వద్ద ఇష్టారాజ్యంగా రోడ్డు తువ్వేసి వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న కథనాన్ని నవంబర్ 21వ తేదీన V3 న్యూస్ ప్రచురించింది.V3 న్యూస్ ప్రచురించిన కథనానికి 48 గంటల్లో అధికారులు స్పందించారు.పలు జంక్షన్ వద్ద మరమ్మతులు పూర్తి చేసి పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా నీటి సరఫరాలకు అంతరాయం లేకుండా పూర్తి చెయ్యడం తో గొంతు ఎండిన ప్రజలకు గొంతు తడిసింది. రాకపోకులకు తీవ్ర ఇబ్బందిగా మారిన జంక్షన్ వద్ద మరమ్మతులు పూర్తి చేయడంతో వాహన చోదుకులు పాదాచారులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా V3 న్యూస్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి ,అధికారులకు ప్రజలు ధన్యవాదములు తెలియజేశారు……