గుంతల మయమైన ముధోల్ ప్రధాన రోడ్లు

Share this:

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు

ముధోల్:గుంతల రోడ్లలో ప్రయాణించాలంటే అదెక్కడుందనగా ముధోల్ గుర్తుకు రావలన్నట్లుగా ఉన్నాయి నియోజకవర్గ కేంద్రంలోని రోడ్లు.ఈ ఏడాది కురిసిన వర్షాలకు రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.ప్రధాన రోడ్ల వెంబడే ఇలాంటి పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.బస్టాండ్ కు వెళ్లే ప్రధాన రోడ్డు వెంబడితో పాటు గ్రామంలో గల శివాలయ రోడ్డు కూడా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలతో నిండి ఉన్నాయి.ప్రధానంగా బస్టాండ్ నుండి ఉన్న మలుపు దగ్గర అతి పెద్ద గుంత ఏర్పడడంతో ప్రమాద భరితంగా మారాయి. ఆ రోడ్డు వెంబడే ఎందరో ప్రయాణిస్తున్న ఎవరికి సమస్య పట్టనట్లుగా ఉన్నారు.ముఖ్యంగా అధికారులు ,ప్రజాప్రతినిధులు ఇలాంటి సమస్యలపై స్పదించకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply