పరిగి పట్టణములో షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు మరమ్మతులు చేయాలి-కాంగ్రెస్ పార్టీ

Share this:

పరిగి(v3News) 12-10-2022: వికారాబాద్ జిల్లా పరిగిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణములో షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు మరమ్మతులు చేయాలని రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి డంతో ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ సందర్భంగా జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, డి సి సి ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ మాట్లాడుతూ.. పరిగి నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారి పై గుంతలు ఏర్పడి అటు నుండి వెళ్లే వాహనదారులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురి కావటం జరుగుతుందని అన్నారు. పలువురు వాహనదారులు క్రిందపడి గాయాలు కాగా, పలువురు మృతి చెందినట్లు వారు తెలిపారు అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి నాగ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.