లక్ష్యం తో చదివితే విజయం తధ్యం: మంత్రి జగదీష్ రెడ్డి

Share this:

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్ళు.. నిధులు..నియామకాలు.

ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు

317 జీవో తెచ్చింది మీకోసమే
కావల్సిన పద్దతుల్లో శిక్షణ ఇవ్వడానికి ఎస్ ఫౌండేషన్ సిద్దం.

సూర్యాపేట లో ఎస్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణ తరగతుల అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హాజరయ్యారు

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్ళు.. నిధులు… నియామకాలలొ భాగంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టేందుకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని, ఇక ఏ ఆటంకాలు లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడు తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తన మాతృమూర్తి గుంటాకండ్ల సావితమ్మ జ్ఞాపకార్థం. మంత్రి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఛైర్మన్ గా కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన *ఎస్. ఫౌండేషన్* ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు అయా విభాగాలలొ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు . ఇందులో భాగంగా నేడు సూర్యాపేట లొ ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకున్న యువతీ ,యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఎస్ ఫౌండేషన్ తరపున ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువత ను ఉద్దేశిoచి మాట్లాడుతూ లక్ష్యం తో చడివితే విజయం తధ్యం అన్నారు.. చదువు జీవితానికి వెలుగు వంటిదన్న మంత్రి 317 జీవో తెచ్చింది కేవలం నిరుద్యోగ యువత కు లాభం చేకూర్చడం కోసమే అన్నారు.విద్యార్థులకు కావల్సిన పద్దతుల్లో తగిన వసతులతో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఎస్ ఫౌండేషన్ సిబ్బంది , అధ్యాపకులు సర్వ సన్నద్ధం అన్నారు.. ఉచిత శిక్షణ ను విద్యార్ధులు సద్వినియోగం చేసుకుని అధికంగా ఉద్యోగాలు సంపాదించాలని మంత్రి ఆకాంక్షించారు.. ప్రిపరేషన్ లొ ఏమి చేయాలో ఏమి చెయకూడదొ అనుభవ అధ్యాపకుల ను అడిగి తెలుసుకోవాలని మంత్రి యువత ను కోరారు.ప్రణాళిక బద్దంగా చదివితే ఉద్యోగం వరించడం ఖాయం అన్నారు.. శిక్షణ తరగతుల అవగాహన సదస్సు కు వచ్చిన 1700 మంది కి పైగా యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తాను కూడా శిక్షణ సందర్బంలొ తరచూ గా శిక్షణ తరగతులకు హాజరవుతానని తెలిపారు..

Ni

Leave a Reply