పారిశుద్ధ్య పనులు చేస్తున్న ముధోల్ సర్పంచ్…

Share this:

  • సర్పంచ్ ట్రాక్టర్ డ్రైవర్ గా…
  • పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాక..! సర్పంచే నేరుగా పారిశుద్ధ పనుల విధులకు హాజరు.

ముధోల్ (V3News) 16-04-2022: నిర్మల్ జిల్లా ముధోల్ మేజర్ గ్రామ పంచాయతికేంద్రం సర్పంచ్ రాజేందర్ పారిశుద్ధ్య పనులు చే పట్టారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో,పారిశుద్ధ్య పనులకు రాకపోవడం వల్ల ముధోల్ మొత్తం ఎక్కడికక్కడే పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి.పారిశుద్ధ్య పనులు చేయడానికి స్వయంగా సర్పంచే ట్రాక్టర్ డ్రైవర్ గా మారి పారిశుద్ధ్య పనులు చేస్తున్నాడు.ఈ సందర్బంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ… కార్మికులకు సరియైన సమయంలో వేతనాలు వేయాలని వేతనాలు నెలలా వారిగా రాకపోవడంతో కార్మికులు పారిశుద్ధ్య పనులకు రాకపోవడంతో ముధోల్ లో ఎక్కడికక్కడే చెత్త చెదారం నిలిచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి నెల ఒకటో తారీఖు మొదట్లోనే కార్మికుల వేతనాలు వేయాలని పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేవిధంగా చూస్తే ప్రతి గ్రామం పరిశుభ్రం గా ఉంటుందని వెంటనే వేతనాలు విదుదల చేయాలనీ విన్నవించారు.

Leave a Reply