ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి

Share this:

వాంకిడి (V3News) 20-08-2022: కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 వ జయంతి ఉత్సవాలను పురష్కారించుకొని తెలంగాణ రేణుకా ఎల్లమ్మ గౌడ చైతన్య ఐక్య సేవ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఘనంగా నిర్వహించారు. గౌడ చైతన్య ఐక్య సేవ సంఘం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నూతన అధ్యక్షులు బండారి ఆంజనేయులు గౌడ కు సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటం బహుకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన విప్లవ వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ సేవలను కొనియాడారు, పాపన్న గౌడ్ మహారాజ్ ఆశయాలు కొనసాగిద్దామన్నారు.ఈ కార్యక్రమంలో మల్లాగౌడ్ పరుశురాములు గౌడ్, శంకర్ గౌడ్ రాజేష్ గౌడ్, నరసింహులు గౌడ్, సాగర్ గౌడ్, సతీష్ గౌడ్, తిరుపతి గౌడ్, సాయికిరణ్ గౌడ్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply