వృద్ధులకు తప్పని తిప్పలు -ఆసరాఅదనుగా వసూళ్లు!!

Share this:

దళారులు, ప్రవేటు వ్యక్తుల చేతుల్లో
ప్రభుత్వ బ్యాంక్ వోచర్స్, చర్యలు…?

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం లో బ్యాంకు ముందు ఓచర్లు రాసిస్తున్న ప్రైవేటు వ్యక్తులు కమాన్ పూర్ లోని ఎస్బీహెచ్ శాఖ నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉంటుంది. మండలం లోని తొమ్మిది గ్రామాల నుంచి వృద్ధులు పింఛను తీసుకోవడానికి సింగరేణి ఉద్యోగులు | వేతన సొమ్ము, మహిళా సంఘాల సభ్యులు పొదుపు ఖాతా లావాదేవీల కోసం. వస్తుంటారు. కాగా నిరక్షరాస్యులైన వృద్ధులు బ్యాంకులో డబ్బులు తీసుకు నేందుకు వీలుగా ఓచర్లు రాసేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడం ప్రైవేటు వ్యక్తులకు వరంగా మారింది బయటి వ్యక్తులు ఓచర్ రాసిస్తే రూ. 20. ఇతర ఫారాలు నింపితే రూ.50 వరకు తీసుకుంటున్నారు. బ్యాంకులో పేరుకే ఇద్దరు అటెండరు ఉన్నా వీరు పైళ్లు అందించడానికే పరిమితమవుతున్నారు. డబ్బులు వేయడానికి, తీసుకోవడానికి అందుబాటులో ఉంచే ఓచర్లు బ్యాంకులో కంటే బయటి వ్యక్తుల వద్దే అధికంగా ఉంటున్నాయని ఖాతాదా రులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఖాతాదారుల నుంచి డబ్బులు గుంజుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బ్యాంకు రావడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధులు వికలాంగులు పార్కింగ్ సరిగ్గా లేదు. బ్యాంకు రావడానికి ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు ఇప్పటికైనా బ్యాంకు అధికారులు వృద్ధులకు, నిరక్షరాస్యులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు మేనేజర్ తో కోరుతున్నారు, మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండ చూస్తా అని తెలిపారు.
దళారుల వద్ద కు బ్యాంక్ వోచర్స్ ఏవిధంగా వస్తున్నాయో తెలియాల్సి ఉంది. ఏదేమైనా బ్యాంక్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయి లో విచారిస్తే గాని విషయాలు తేటతెల్లం కావు. అయితే బ్యాంక్ నిరక్షరాస్య కష్టమర్ల కు బ్యాంక్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ఉంది. అయితే ఇదే విషయం మండలానికి చెందిన కాంగ్రేస్ నేతలు బ్యాంక్ మేనేజర్ కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. కాగా ఇదే విషయమై బ్యాంక్ మేనేజర్ ను వివరణ కోరగా పూర్తి స్థాయి లో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply