వైద్యుల నిర్లక్ష్యం తో సింగరేణి కార్మికుడు మృతి

Share this:

గోదావరిఖని(v3news) 28-09-22: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి సిఎస్ పి వన్ లో తిప్పారపు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.గత అయిదు రోజుల క్రితం విధి నిర్వహణలో కళ్లు తిరిగి పడిపోగా,సింగరేణి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.మెరుగైన వైద్యం కోసం బందువులు హైదరాబాద్ కు రెఫెరల్ చేయాలని వేడుకున్నప్పుటికి,వైద్యలు వినకపోవటంతో,తెలవారజామున రక్తం కక్కుకుని మృతి చెందాడు.వైద్యలను ఎంత బ్రతిమిలాడిన కార్పోరేట్ ఆస్పతి కి తరలించకుండా వైద్యల నిర్లక్ష్యం వల్లనే శ్రీనివాస్ మృతి చెందాడు అంటు,కార్మికసంఘాల నాయకులు,బందువులు ఆరోపించారు.ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.శ్రీనివాస్ కు వైద్యం అందించిన వైద్యుని చేతిలో ఈ నెలలో ముగ్గురు మృత్యువు వాత పడినారని,కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. కార్మికుని కుటుంబానికి న్యాయం అందించాలని డిమాండ్ చేశారు.పోలీసులు ఆస్పత్రిలో పెద్దఎత్తున మొహరించారు.