కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధినేత సోనియా గాంధీ దిష్టి బొమ్మను దహనం బా.జ.పా నేతలు

Share this:

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టన కేంద్రంలోని వివేకానందా విగ్రహం వద్ద భాజాపా మండలాధ్యక్షుడు కస్తూరీ కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కమలనాథులు ఆందోళనకు దిగారు. రాష్ట్రపతిని అవమాన పరిచే విధంగా కాంగ్రెస్ నేత మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిచారు. సోనియాగాంధీ దిష్టిబోమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఓ గౌరవపదంలో ఉన్న గిరిజన మహిళ అయిన ముర్ముపై కాంగ్రెస్ నేత చేసిన వాఖ్యలను వెనక్కితీసుకోని బహిరంగంగా క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో భాజాప మండల ప్రధానకార్యదర్శులు కోల కృష్ణ, సౌల్ల క్రాంతి, పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, ఆది శేకర్, గుండవేని తిరుపతి, కాసొడి రమేష్, బిజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్దన్, టౌన్ ప్రెసిడెంట్ పెంజర్ల కళ్యాణ్ యాదవ్, ఓబీసీ మొర్చా మండల అధ్యక్షుడు జిల్లెళ్ళ మల్లేశం, దళితమొర్చా అధ్యక్షులు తిరుపతి, నాయకులు మీస శంకర్, కరెడ్ల రమేష్ రెడ్డి, కిట్టు, మద్దికుంట రమేష్, సురేష్, వేణు, బాలాజీ, అజయ్, సతీష్, చందు, మారుతీ, బండ సతీష్, సాయి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply