ప్రజా సంక్షేమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి:– బి ఎస్ పి నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్.

Share this:

నిర్మల్ నియోజకవర్గం లోని చిట్యాల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ… ప్రజాసంక్షేమం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైపల్యం చెందాయని మొన్నటి వరకు నోట్ల రద్దుతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు నిన్న రైతులు ఇప్పుడు నిరుద్యోగం పెరిగి నిరుద్యోగులు కూడా రోడ్ల పైకి కొచ్చే ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారని దేశంలో రూపాయి విలువ రోజురోజుకు పతనమవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ అనేక పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకపోవడం సమంజసం కాదు ఒక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ప ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసివేశారు కోట్ల మంది ప్రజలు దీనావస్థలో ఉన్నారని ఎస్సీ ఎస్టీల పైన దాడులు మహిళ పైన అత్యాచారాలు పెరిగిన పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది నల్ల డబ్బు తెస్తాను ప్రజల అకౌంట్లో జమ చేస్తానని ప్రజలను వంచించారని భారత రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలుపరుస్తామని ప్రమాణం చేసి చట్టాలను సైతం అగౌరపరుస్తున్నారు 1300 మంది ఆత్మబలి దానాలు చేసుకున్న తెలంగాణలో తెలంగాణ అమరవీరులను కేటీఆర్ గారు కించపరచడం సబబు కాదు తెలంగాణలో చార్జీల మోత ధరల మంట అత్యాచారాలు మానభంగాలు భూకబ్జాలు వినకుంటే కేసులు పెట్టి బహుజనులను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు హైదరాబాద్ మహానగరంలో పాలన లో పోటీపడాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు ప్రచారం కోసం ఫ్లెక్స్ ల రూపంలో పోటీపడి ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.బహు బహుజన రాజ్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు సేపూరి సిద్ధార్థ గ్రామ మాజీ సర్పంచ్ మొగిలి యరా సాయందర్ గౌతు సుధాకర్ రాజేశ్వర్ తలారి భోజన్న తలారి రాజశేఖర్ గౌతమ్ లతోపాటు పలువురు బిఎస్పి కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply