తొల‌గించిన మున్సిప‌ల్ పారిశుధ్య కార్మికుల‌ను వెంట‌నే విధుల్లో చేర్చుకోవాలి

Share this:

చిలకలూరిపేట(V3News): చిలకలూరిపేట ప‌ట్ట‌ణంలో ర్యాలీ… మున్సిప‌ల్ కార్యాల‌యం ఎదుట ధ‌ర్న ర్యాలీ నిర్వ‌హిస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు. మున్సిప‌ల్ మేనేజ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు.. ఎన్నో క‌ష్టాల‌తో జీవితాల‌ను లాక్కొస్తున్న మున్సిప‌ల్ పారిశుధ్య కార్మికుల‌ను తొల‌గించి వారి జీవితాల‌ను రోడ్డున ప‌డ‌వేయ‌టం అమానుష‌మ‌ని, దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మానికి సిద్ద‌మౌతున్నామ‌ని సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ నాయ‌కులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం మ‌రో ముగ్గురు మున్సిప‌ల్ కార్మికుల‌ను తొల‌గించిన నేప‌థ్యంలో సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ల ఆధ్వ‌ర్యంలో సీపీఐ కార్యాల‌యం నుంచి ర్యాలీ, మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద ధ‌ర్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే చిల‌క‌లూరిపేట పారిశుధ్య కార్మికులు ప‌నివిష‌యంలో ఎంతో పేరు గ‌డించార‌ని, గ‌తంలో అవార్డు సాధించ‌టానికి పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో ఉంద‌న్నారు. అటువంటి కార్మికుల‌ను అకార‌ణంగా విధుల నుంచి తొల‌గించ‌టం స‌రికాద‌న్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ, ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ మున్సిప‌ల్ పారిశుధ్య కార్మికులు ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌క విధులు నిర్వ‌హించిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు. ఏ ఒక్క కార్మికుడ్ని తొల‌గించినా, కార్మికుల్లో ఎవ‌ర్ని ఇబ్బందులుకు గురి చేసినా కార్మికులంద‌రూ సంఘ‌టింగా నిల‌వాల‌ని పిలుపు నిచ్చారు. బాధిత కార్మికుల ప‌క్ష‌నా ఏఐటీయూసీ, ఏపీ మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ అండ‌గా నిలిచి పోరాడుతుంద‌ని తెలిపారు. తొల‌గించిన కార్మికుల‌ను వెంట‌నే విధుల్లో తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సీపీఐ ఏరియా కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ‌సుబ్బాయ‌మ్మ‌, ఏవైఐఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు పేలూరి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు, ఉపాధ్య‌క్షుడు సీఆర్‌ భార‌తి, ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి చెరుకుప‌ల్లి నిర్మ‌ల‌, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ చిల‌క‌లూరిపేట కార్య‌ద‌ర్శి బి. చిన యోగ‌య్య, కోశాధికారి జ‌య‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం మున్సిప‌ల్ మేనేజ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

Leave a Reply