విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు…

Share this:

  • గొప్ప గొప్ప కలలుకనండి ఆ వైపుగా ప్రయాణం చేయండి.
  • సమగ్ర వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో పలువురి ప్రముఖుల మాటలు.

భైంసా(V3News) 29-08-2022: నిర్మల్ జిల్లా భైంసా పట్టణనుండి దేగా0 గ్రామం వెళ్ళే రహదారిలో గల హరియాలీ కన్వెన్షన్ హాల్లో సోమవారం ఆనందిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాడేకర్ లక్ష్మణ్,మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యక్తిత్వ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి తాలూకాలోని పలు మండలాలగ్రామాలలోని విద్యాసంస్థల నుండి విద్యార్థులు,యువకులు, పోషకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ,బైంసా పట్టణ ఏ.ఎస్.పి కిరణ్ కారే, అలాగే వ్యక్తిత్వ వికాస శిక్షకులు తిరునగరి శ్రీహరి హాజరై మాట్లాడుతూ… విద్యార్థి దశ నుండి ఏదైనా సాధించవచ్చని, గొప్ప గొప్ప కలలు కనడం వాటిని అందుకునే దశగా ప్రయత్నం చేసి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని తెలిపారు. సమాజంలో ఉన్నత విలువలు కలిగి విద్యనభ్యసించడంలో ముందుంటే మంచి ప్రయోజకులుగా తయారవుతారని హాజరైన విద్యార్థులకు సూచించారు. గొప్ప వ్యక్తులుగా ఎదగాలని పట్టుదల ఉంటే చిన్న,పెద్ద , బీద మధ్యతరగతి,ఉన్నతులు అనే అడ్డంకులేవీ రావని తెలిపారు. తాలుకవ్యాప్తంగా ఇటువంటి వ్యక్తిత్వ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మొదటిసారని,ఈ ఫౌండేషన్ మంచి లక్ష్యలతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని పలువురు పోషకులు,వచ్చిన ప్రముఖులు కోరుతూ అభినందించారు.