మూడవ రోజు కొనసాగుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన….

Share this:

బాసర(V3News) 16-06-2022: తమ సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లు నేరవేర్చాలని ఆందోళన బాట పట్టిన బాసర ట్రీపుల్ఐటీ విద్యార్థులపై నిర్భంధకాండ కొనసాగుతుంది. విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భధ్రత చర్యలు చేపట్టారు… కాగా విద్యార్థుల సమస్యలపై గవర్నర్ తమిలి సై స్పందించారు.. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తల్లి దండ్రుల ఆశలను కాపాడుకోవాలని సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు గవర్నర్.. ఇదిలా ఉండగా విద్యార్థులకు మద్దత్తు తెలపడానికి వచ్చిన టీ జె ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.. మీడియాను గేటు దగ్గరికి కూడా రానివ్వకుండా బారికేడ్లు తాళ్ళు కట్టారు… మంగళ, బుధవారాల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు హాస్టల్ గదుల నుంచి యూనివర్సిటీ ప్రాంగణంలోని రోడ్లపై భైఠాయించి ఆందోళనలు కొనసాగించారు. ప్రవేశ మార్గంలోని గేటు వద్ద సైతం భైఠాయించి ధర్నాను కొనసాగించారు. రెండ్రోజులుగా విద్యార్థులు ఆందోళనలు తీవ్రతరం చేయడంతో మూడో రోజైన గురువారం పోలీసు అధికారులు మరింత పకడ్బందీ విధానాలను అవలంభించారు. అర్ధ శాతానికి పైగా విద్యార్థులను హాస్టల్ గదుల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మరో అర్ధశాతం మంది వివిధ మార్గాల్లో యూనివర్సిటీ ప్రవేశ మార్గంలోని గేటు వద్దకు చేరుకుని అక్కడ భైఠాయించి మూడో రోజు ఆందోళనలు ప్రారంభించారు. విద్యార్థులను నిర్భంధకాండలో కొనసాగించి ఆందోళనలను విరమింపజేసే దిశగా ప్రభుత్వం, పోలీసులు పకడ్బందీ వ్యూహాలతో వ్యవహారిస్తున్నారు. అయితే విద్యార్థులు సైతం పట్టు వదలని ధీమాతో సమస్యలను పరిష్కరించుకునేంత వరకు డిమాండ్లను నేరవేర్చుకునేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని ధర్నాలను కొనసాగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి గురువారం నుంచి తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించినప్పటికీ ఒక్క తరగతి కూడా జరుగకపోవడం విశేషం. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వం తీరును తప్పు బడుతు విద్యార్థులపై ఒత్తిడి తీసుకోచ్చి కేసులు పెడుతామని భయాందోళణకు గురి చేసి ధర్నా విరమింపజేసేందుకు చర్యలు చేపట్టడం సిగ్గు చేటు విషయమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు…..

Leave a Reply