విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల కుటుంబాలకు భరోసాగా నిలవాలి– విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ

Share this:

సూర్యాపేట(V3News) 22-09-2022: విశ్వ బ్రాహ్మణ జర్నలిస్టులు ప్రతి విశ్వ బ్రాహ్మణ జర్నలిస్టు కుటుంబానికి భరోసాగా నిలవాలని విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంగీత్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు ఐకమత్యంతో పని చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మడూరి బ్రహ్మచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మడూరి బ్రహ్మచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాడోజు వాణిశ్రీకాంత్ రాజ్, రంగు దిలీప్, దారోజు జానికిరాములు, తౌడోజు శైలేంద్రాచారి, శ్రీపాద భాస్కరాచారి, సూర్యాపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌడోజు సాంబాచారి, వంగాల వెంకటాచారి, నాగార్జునపు రామాచారి, శ్రీనివాసాచారి, వీరాచారి, గౌరోజు అశోక్, బాణాల విజయ్ కుమార్, పాండురంగాచారి, సొల్లేటి ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.