ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా మంత్రి క్యాంపు కార్యాలయం

Share this:

అది సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కాదు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా మంత్రి క్యాంపు కార్యాలయం
సుడి గాలి సైతం సిగ్గు పడేలా పర్యటిస్తూ .. నిరంతరం ప్రజల కోసం పరితపిస్తాన్నా సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి

.ఆయన ప్రజల తో మమేకం అవుతున్న తీరు అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఎమ్మెల్యే తీరును ప్రశంసిస్తూ ఉన్నారంటే ఆయన పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెల రోజులుగా సామాన్యులకు చేరువగా నేరుగా వారి సమస్యలను వింటూ వాటికి సత్వర పరిష్కారాలు అందజేస్తూ పాలన లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.. సూర్యాపేట క్యాంపు కార్యాలయం లో సామాన్య ప్రజల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మంత్రి , ఇప్పటి వరకు రెండు వేల మంది కి పైగా ప్రజలను నేరుగా కలిశారు. తాను సూర్యాపేట లో అన్న సమయం లో క్రమం తప్పకుండా సామాన్య ప్రజలను కలుస్తూ వారి సమస్యలను ఓపికగా వింటూ , వాటి ని పరిష్కారం అందజేస్తున్నారు…

ఎంతో మంది విధి వంచితులకు ట్రీట్ మెంట్ అందిస్తూ, ట్రై మోటార్ సైకిళ్లు, భూ సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్, పెన్షన్, కుటుంబ సమస్యలను వెంటనే పరిష్కారం అందజేస్తున్నారు..సూర్యాపేట లో అందుబాటు లో లేనప్పుడు సమస్యల పై వచ్చే ప్రజల వివరాలు, వారి ఫోన్ నంబర్ల ను నమోదుచేసుకుని తాను క్యాంపు కార్యాలయానికి రాగానే వారికి సమాచారం అందేజేసి , సమస్యలను పరిష్కరిస్తున్నారు..సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తాతూ దానికి మార్గం వెతుకుతూ సామాన్య ప్రజల మనసులలో చిరస్థాయిగా తన దైన ముద్ర వేసుకుంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఉద్యమం తొలి నుండి మహా నేత,ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అడుగులు వేసిన జగదీశ్ రెడ్డి ప్రజా సేవలోనూ, ప్రత్యేక వైఖరి అవలంబిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. రాష్ట్ర మంత్రి గా రాజకీయ విమర్శలను తీవ్ర స్థాయి లో గుప్పించడం మాత్రమే కాదు, తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట ప్రజల సంక్షేమం లోనూ, అభివృద్ధి లో ముందున్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే అద్భుతాలు చెయవచ్చనడానికి యావత్ దేశానికే తలమానికంగా సూర్యాపేట లో జరిగిన అభవృద్ద్ది పనులే నిదర్శనం గా నిలుస్తున్నాయి.

Leave a Reply