వార్డుల్లోకి నిధుల కేటాయింపు జరిగి ఏడాది పూర్తి

Share this:

  • పేరుకే కౌన్సిల్ సమావేశాలు
  • వార్డుల్లో అభివృద్ధి గురించి ఊసే లేదు
  • జిల్లా కేంద్రంలో గల మునిసిపాలిటీ దుస్థితి
  • ఉత్సవా విగ్రహాలుగా మారిపోయిన కౌన్సిల్ సభ్యులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 48 వార్డులలో సుమారు ఏడాది కాలం నుంచి ఎటువంటి నిధులు ఇవ్వకుండా వార్డు అభివృద్ధి నిరోధకులుగా కౌన్సిల్ మారుతుంది.
అధికారులు కూడా నిమ్మకు నేరెత్తినట్లుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారు. అత్యవసర పనుల నిమిత్తం వార్డు కౌన్సిలర్లు చెప్పులు అరిగేటట్లు తిరిగితే ఐదు పది లక్షలు పనులు జరగడం లేదు .కౌన్సిల్ లోని సభ్యులు కూడా దీనిపై దృష్టి సారించకపోవడం. వార్డుల్లోని పలు అభివృద్ధి పనులు నిలిచిపోవడం…అంతేకాకుండా విలీన గ్రామ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి..

అధికార పార్టీ ఐనా, ప్రతిపక్ష పార్టీ ఐనా కౌన్సిల్ సభ్యులు ఈ విషయంలో ఉత్సాహ విగ్రహాలుగా మారిపోయారు.ఇప్పటికైనా మంత్రి జగదీష్ రెడ్డి దీనిపై దృష్టి సారించి వార్డు లోపల అభివృద్ధి పనులు చేపట్టకపోతే చాప కింద నీరులా ప్రతిపక్షాలకు అస్త్రాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డు సుందరీకరణ పై ఉన్న దృష్టి అధికారులు వార్డుల్లో దృష్టి పెట్టకపోవడం మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ కూడా దీనిమీద ఈ విషయంపై దృష్టి సారించకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.