షాదనగర్ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వాల నమోదుపై ఠాగూర్ అభినందనలు

Share this:

మంత్రి మల్లారెడ్డికి పట్టిన గతే పడుతుంది.మల్లురవి కీలక వ్యాఖ్యలు

షాదనగర్(V3News) 01-06-2022: రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గ కేంద్రంలోని వి కన్వెన్షన్ హాల్ లో నియోజకవర్గ స్ధాయి బూత్ కమిటీల డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమలపై స్ధానిక నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ ఎన్ రోలర్స్ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.గల్లిలో కుస్తీ ఢిల్లీలో దోస్తీతో ప్రధాని మోడీ, సిఎం కేసీఆర్ మంచి స్నేహితులని చమత్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని ప్రజలు ఉరికించి కొట్టారని రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు నాయకుల కు అదే గతి పడుతుందని మాజీ పార్లమెంటు సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి వ్యాఖ్యలు చేశారు.మల్లారెడ్డిని ఎందుకు తరిమికొట్టారో ప్రభుత్వం బేరీజు వేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

Leave a Reply