బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Share this:

సనత్ నగర్(V3News) 26-09-2022: దేవీ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు, అక్టోబర్ 2వ తేదీ బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాలను బల్కంపేటలో ఘనంగా నిర్వహించాలని మంత్రి కోరారు.తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేటట్టు మహిళలు సాంప్రదాయబద్ధమైన బతుకమ్మ ఆటలతో,అలాగే దైవభక్తితో దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేశారు.బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ టెంపుల్ సిటీగా మారిందని అన్నారు.నియోజకవర్గంలో అత్యధిక దేవాలయాలు ఉండడం నియోజకవర్గ ప్రజల పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించడం జరిగిందని తెలియజేశారు