చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి తీరుతాం..

Share this:

  • దేశం పార్టీ నలభై వసంతాల వేడుకలో మాజీ ఎమ్మెల్సీ దేవ గుడి నారాయణ రెడ్డి

జమ్మలమడుగు(V3News): రాబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉందని,అందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రతిజ్ఞ చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల వేడుక సందర్భంగా జమ్మలమడుగు లోని సంజామల మోటు వద్ద దేశం పార్టీ జెండాను ఆవిస్క్రుతం చేశారు. అనంతరం ఎత్తపు కాలనీలోని బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తి కావాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే మేధావి అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు.ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా చేపట్టకుండా మూడు సంవత్సరాలు గడిపిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేయకపోగా చంద్రబాబు చేసిన అభివృద్ధిని కాలరాసింది అన్నారు.అనంతరం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి దేవగుడి బూపెష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటికి మాత్రమే పరిమితం అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు.ప్రజలు చచ్చిపోతున్నా,ఆడపడుచు లకు అన్యాయం జరుగుతున్నా,ఎస్ సి,ఎస్టీ, బిసి ఇలా ప్రతి వర్గాన్ని దోచుకున్న ఘనత వై యస్ జగన్ మోహన్ రెడ్డిది అన్నారు.స్థానిక శాసన సభ్యులు సుదీర్ రెడ్డి కనీసం ఒక్క మరుగు దొడ్డి సైతం కట్టించేందుకు మా వద్ద నిధులు లేవని బాహాటంగా చెబుతున్నారు అని ఆమాత్రం సాధించలేని ఎమ్మెల్యే ఎందుకు అన్నారు. అనంతరం అరవై ఏళ్లు ఫై బడిన తెలుగుదేశం కార్యకర్తలు నలభై మందికి దుశ్శావుల తో సన్మానించారు.

Leave a Reply