సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టులదే

Share this:

చరిత్రను కనుమరుగు చేస్తామంటే సహించేది లేదు..

సాయుధ పోరాటంలో భాజపా పాత్ర ఏమాత్రం లేదు..

భద్రాచలం.13/09/2022 :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక జగదీష్ కాలనీ నందు సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాను సిపిఐ సీనియర్ నాయకులు బత్తుల నరసింహులు ఎగురవేశారు..అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శిఆకోజు సునిల్ కుమార్ మాట్లాడుతూ సాయుధ పోరాటం నడిపి కమ్యూనిస్టు లు తెలంగాణ విముక్తి కి కృషిచేసారని అన్నారు.నేటి ప్రభుత్వాలు చరిత్రను కనుమరుగుచేస్తామంటే సహించేది లేదని.సాయుధ పోరాటంలో తెలంగాణా హైదరాబాద్ సంస్థానం భారత దేశం లో విలీనం చేసే పోరాటంలో భాజపా పాత్ర అనువంత కూడా లేదని అన్నారు..సాయుధ పోరాట అమరుల స్పూర్తితో ఉద్యమించాలని అన్నారు..ఈ కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శి నాగరాజు.సీనియర్ నాయకులు గుంజా బాబు.కల్లూరి శ్రీరాములు. sk ఖాదర్. గణేష్. నాని. సాయిరామ్.అశోక్. రాజా .సుబ్బారావు తదితరులు ఉన్నారు