మన తెలంగాణ సంస్కృతిని అమెరికాలో తెలియపరచిన బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Share this:

అమెరికా లో తెలంగాణ తెలుగు సంఘం (టిటిఏ)న్యూయార్క్ పక్షాణ న్యూయార్క్ లో ఘనంగ నిర్వహించిన బోనాల పండుగ సందర్బముగ అతిధులుగా
టిటిఏ ఫౌండర్‌ పైల్ల మల్లారెడ్డి,కాంగ్రేస్‌ సీనియర్‌ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, న్యూజెర్సీ తెలుగు సంఘం ప్రధాన కార్యదర్శి భగవాన్ రెడ్డి పింగల్‌, టిడిఫ్ అద్యక్షలు లక్ష్మారెడ్డి అనుగుల టిటిఏ న్యూయార్క్ అద్యక్షలు డాక్టర్‌ రాజేందర్‌ రెడ్డి జిన్నా ఎలెక్టు ప్రెసిడెంట్‌ సునిల్‌ రెడ్డి హాజరై ప్రవాస భారతీయ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు* తెలిపారు.

మన తెలంగాణ సంస్కృతిని సత్‌ సంప్రదాయ ఆచారాలను ప్రతిబింబించే జానపదుల జాతర బోనాల పండుగ అని
వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను, పశువులను, పంటలను కాపాడాలని అమ్మవారిని వేడుకొని అన్ని రకాల నైవేద్యం సమర్పించే తెలంగాణ పెద్ద పండుగ అని* కొనియాడారు

ఆ అమ్మవార్ల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు పోవాలని . ఆ చల్లని తల్లుల దీవెనలతో అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాస భారతీయ ప్రజలంతా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగ సుఖసంతోషాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితాలు విరాజిల్లాలని ఆ అమ్మవార్ల ఆశీర్వాదం దీవెనలు దండిగ ఉండాలని కోరారు బోనాల జాతరను అమెరికా లో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడము అభినందనీయమని పోతరాజు వేషధారణ, పసుపు, కుంకుమ,వేపఆకులతో తీర్చిదిద్దిన నిండు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి పూజలు గుమ్మడికాయ, కల్లు నైవేద్యం పండ్లతో అమ్మవారికి ఆరగించి సాంప్రదాయ పద్దతిలో ఆడవారు , మగవారు పిల్లలు తయారై కుటుంబ సభ్యులందరు కదలి వచ్చి బోనాలు తలపై ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో న్రుత్యాలతో పూనకంలో ఉరేంగిపుగా బయలుదేరడము అనంతరము భక్తులు పూజలతో జరిపిన సంపూర్ణ బోనాల పండుగ అందరిని ఆకర్షించింది. అమెరికాలో తెలంగాణ సాంప్రదాయ పద్దతులను ఈనాటి తరానికి కళ్ళకు కట్టినట్టు బోనాల పండుగను తెలంగాణ తెలుగు సంఘం న్యూయార్క్ (టిటిఏ) అమెరికా వారు ఘనంగ నిర్వహించారు.
సుమారు 500 మంది భక్తులు పాల్గన్నారు.
ఈ బోనాల పండుగ కార్యక్రమం ఉదయము 11 గంటల నుండి సాయంత్రము 4 గంటలవరకు నిర్వహించారు. అన్నిరకాల వంటకాలతో తయారు చేసిన బోజనము వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేసారు. అనంతరము కల్చరల్‌ కార్యక్రమం తెలంగాణ జానపద ఆట పాటలతో కనుల పండుగగా జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి రాంపల్లి, రాజేందర్‌ డిచ్‌పల్లి, రాజేశ్వర్‌రెడ్డి గంగసాని ఐఓసి న్యూజెర్సీ అద్యక్షలు, రంజిత్‌ క్యాతం టిటిఏ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ , సుధా మన్నెమ్‌ టిటిఏ ప్రధాన కార్యదర్శి కాత్యాయని,లింగారెడ్డి, కుమారస్వామి, రాజ్‌ ర్యాలి. రాహుల్‌, దినేశ్‌, సురేందర్‌, రమా, రాణి , రాజలింగారెడ్డి ఆరూష్‌ రెడ్డి కలకోట న్యూయార్క్ , న్యూజెర్సీ, కనెక్టుకట్‌ లనుండి పాల్గొన్నారు

Leave a Reply