కాంగ్రెస్ ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ..

Share this:

యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గాలలో ధర్నాలు..

24 గంటల్లో ప్రభుత్వం వడ్లు కొనుగోలు ప్రారంభించాలని లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించిన రేవంత్, భట్టి, కోమటిరెడ్డి..

రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలతో ఉద్యమించిన కాంగ్రెస్ శ్రేణులు..

చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత..

ఖమ్మం జిల్లాలో భట్టి, మంథని లో శ్రీధర్ బాబు, జగిత్యాలలో జీవన్ రెడ్డి, కరీంనగర్ లో పొన్నం, హైదరాబాద్ లో అంజన్ కుమార్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నియోజక వర్గ కేంద్రం గజ్వెల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ఎడ్ల బండ్లపై వచ్చి ప్రేజ్ఞాపూర్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.

డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ బాద్యులు, నియోజక వర్గ కో ఆర్డినెటర్లు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు ధర్నాలలో పాల్గొన్నారు..

కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో రైతులు పెద్దఎత్తున స్పందించి ధర్నాలలో పాల్గొనడంతో రాస్తా రొఖోలతో అనేక ప్రాంతాలలో రోడ్లు పై వాహనాలు కిలోమీటర్లు మేర నిలిచిపోయాయి.

కరీంనగర్ మానకొండూరు వద్ద జరిగిన ధర్నాలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కు గాయాలు కావడం తో సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply