దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే- రాష్ట్ర వైద్య ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

Share this:

పటాన్ చెరు(V3News) 18-04-2022: పటాన్ చెరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజ్ వస్తుందన్నారు. అదే విధంగా పటాన్ చెరు లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు జరగబోతుందని తెలిపారు. ఆసుపత్రుల నిర్వహణలో దేశంలోనే తెలంగాణ మూడవ స్థానంలో ఉందన్నారు. వచ్చే 15 రోజుల పాటు హెల్త్ క్యాంపులు నిర్వహణ జరుగబోతోందని ప్రజలంతా ఆరోగ్య శిబిరాలు వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని మంత్రి హరీశ్ రావు
సూచించారు. ఈ కార్యక్రమంలో యంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply