మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద బైక్ ను వెనక నుండి కారు ఢీ కొట్టిన సంఘటన ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి

Share this:

కోదాడ(V3News) 22-04-2022: కోదాడ పట్టణ పరిధిలోని మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద బైక్ ను వెనక నుండి కారు ఢీ కొట్టిన సంఘటనలు ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందిన హృదయ వేదారక సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నల్లబండ గూడెం గ్రామానికి చెందిన బోయిళ్ల శ్రీను భార్య నాగరాణి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.వీరికి 3 కుమార్తె లు కాగా నల్లబండ గూడెం నుండి అత్తగారి ఊరు చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో మర్గమధ్యలో 65 నెంబర్ జాతీయ రహదారిపై మేళ్లచెరువు వెళ్లే ఫ్లై ఓవర్ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న భార్యాభర్త ముగ్గురు పిల్లలు ఉండగా వారిలో నలుగురు ఫ్లైఓవర్ మీద నుండి గాలిలో ఎగిరి క్రింద రోడ్డుపై పడ్డారు. బోయళ్ల శ్రీను ప్రమాద స్థలంలో మృతిచెందగా 108 వాహనంలో తీసుకు వెళుతున్న క్రమంలో మృతుని కూతురు ఉషశ్రీ మృతి చెందింది.మృతుని భార్య నాగరాణి చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినది. మృతి ని కుమార్తెలు హన్సిక, ఐశ్వర్య లకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.దీని పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మెళ్లచెర్వు లో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళుతున్న క్రమంలో ప్రమాద స్థలం వద్ద ఆగి 108 వాహనంలో ఎక్కించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించి, ఇద్దరు పిల్లలకు మెరుగైన వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నారు.

Leave a Reply