గుమ్మడివెల్లి,కళ్లెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

Share this:

జనగామ (V3News) 22-04-2022:- లింగాల ఘణపురం మండలంలోని గుమ్మడివెల్లి, కళ్లెం,గ్రామాలలో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని భావించిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా రైతును రాజును చేయాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని తెలిపారు.ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా రైతు,రైతుల కోసం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని,తెలంగాణ రైతులు యాసంగిలో పండించే మొత్తం ధాన్యాన్ని ప్రతిగింజ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపి చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి,జడ్పిటీసి గుడి వంశీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్,భాగ్యలక్ష్మి,గణపతి,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటీసిలు, పార్టీ శ్రేణులు సంబంధిత శాఖల అధికారులు మరియు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply