అడవిదేవులపల్లి లో పలు గ్రామాలలో సీసీ రోడ్లు,అభివృద్ధి శంకుస్థాపనలు- మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

నల్గొండ జిల్లా , మిర్యాలగూడ కాన్స్టెన్సీ అ అడవిదేవులపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
MGNREGS (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) గ్రాంట్ ద్వారా మంజూరైన 70 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

అడవిదేవులపల్లి 15 లక్షల తో సి.సి రోడ్, బాలెంపల్లీలో 5 లక్షలతో సి.సి రోడ్, బంగారికుంట తండాలో 5 లక్షలతో సి.సి రోడ్, జీలకరకుంట తండాలో 5 లక్షలతో సి.సి రోడ్, కొత్తనంది కొండలో 5 లక్షలతో సి.సి రోడ్, మొల్కచెర్లలో 5 లక్షలతో సి.సి రోడ్, ఉల్సాయి పాలెంలో 25 లక్షలతో సి.సి రోడ్ మరియు గోన్య తండాలో 5 లక్షలతో సి.సి రోడ్) సి.సి రోడ్ నిర్మాణాలకు మరియు 20 లక్షల రూపాయల నిధులతో గోన్య తండా గ్రామం నందు నూతన గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు.ఈ‌కార్యక్రమంలో ఎం.పి.పి ధనవత్ బాలాజీ నాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్, మాజీ ఎంపిపి కురాకుల మంగమ్మ, మండల పార్టీ అద్యక్షులు కురాకుల చినరామయ్య, సర్పంచుల ఫోరం అద్యక్షులు కొత్తా మర్రెడ్డి, B.R.S నాయకులు గురువయ్య, ముత్యాలు, సూర్య నాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను, ఆయా గ్రామాల సర్పంచులు, ఎం.పీ.టీ.సీ లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, పంచాయతీ రాజ్ శాఖ DE వెంకటేశ్వర్ రావు, గ్రామ పార్టీ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.