అభివృద్ధి, సంక్షేమమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యం – ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ

శేర్లింగంపల్లి నియోజకవర్గం, కూకట్పల్లి సర్కిల్ లోని, మంజూరైన 31 మందికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్ని శ్రీనివాసరావు తో కలిసి అర్హులైన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా , వాటిని అమలు చేయడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వివి నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు నాగినేని చంద్రకాంతరావు, సీనియర్ నాయకులు బోయ కిషన్, మహిళా నాయకురాలు శ్రావణి రెడ్డి, ఆంజనేయులు , తదితరులు పాల్గొన్నారు.