ఆమ్ ఆద్మీ పార్టీని సంస్తాగతంగా బలోపేతం చేద్దాం-సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి డా|| కళ్లేపల్లి నరేష్

సూర్యాపేటలోని స్థానిక విద్యానగర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, డా “కళ్లేపల్లి నరేష్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ని నియోజకవర్గం లో గ్రామ గ్రామాన సంస్థగతంగా బలోపేతం చేయాలనీ పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు రానున్న అసంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలనీ అన్నారు పార్టీని గ్రామ స్థాయి నుండి నిర్మాణం చేస్తూ అవినీతి రహిత సమాజం రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావాలని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ని ఆ రాష్ట్ర ప్రజలు అధికారంలోకి ఏవిధంగా తీసుకోచ్చారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు అధికారంలోకి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకొని రావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియ జేయాలనీ అన్నారు ఫిబ్రవరి 15 న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ అఫ్జల్ గారు హాజరు అవుతురాని అన్నారు.. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు కొచ్చెర్ల మధు, రాకేష్, దేవా, నరేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.