ఎదులబాద్ గ్రామపంచాయతీలో 15, 20 లక్షల పైగా అవకతవకలు:

మేడ్చల్ జిల్లా..ఘట్కేసర్ మండల పరిధి ఎదులబాద్ గ్రామపంచాయతీలో 15 20 లక్షలకు పైగా అవకతవకులు జరిగాయని ఉపసర్పంచ్ ఉప్పు లింగం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది రోజుల నుండి ఏదులాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని జరిగిన అవకతవకల గురించి అడిషనల్ కలెక్టర్ కి, ఎంపీ ఓ కు ఫిర్యాదు చేశామని అన్నారు. ఏదులాబాద్ గ్రామపంచాయతీలో గత ఆరు నెలలుగా ఎన్ని ఇండ్లకు రసీదులు ఇచ్చారో అందులో రెండు బుక్ సిరీస్ లు ఆన్లైన్లో ఎంట్రీ లేవని అన్నారు. రాతపూర్వకంగా రాసే ఐఆర్ బుక్కులో కూడా ఎంట్రీ లేదని అన్నారు. ఈ గ్రామపంచాయతీలో కనీసం 15 20 లక్షల కుంభకోణం జరిగిందని వారు తెలిపారు. ఇంత జరుగుతున్న సర్పంచ్ కాలేరు సురేష్ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఇందులో బిల్ కలెక్టర్, సర్పంచ్ కాలేరు సురేష్ హస్తం ఉందని వారు అన్నారు. గ్రామపంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు లింగం, వార్డు సభ్యులు శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..