ఎస్సీ కార్పొరేషన్ భూములను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి-తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య

మహబూబ్ నగర్ :- మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో గల ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన సర్వే నెంబర్లు: 247,250 ల లో “5” ఎకరాల “30” గుంటల భూమి కలదు. అందులో ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తూ కొంత భాగంలో కోళ్ల ఫారాలు నిర్మించి ఇచ్చారు. అందులో బాలుర వసతి గృహాలు మూడు కలవు. మిగతా కాలి స్థలాన్ని చుట్టుపక్కల ప్రహరీ నిర్మించారు. కానీ ఇప్పుడు కొంతమంది అక్రమంగా హద్దులం తొలగించి, కూల్చివేసి అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలంగాణ మాల మహానాడు దృష్టికి రాగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య తన బృందంతో కలిసి అక్రమంగా నేర్పిస్తున్న ఇళ్లను పరిశీలించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహయ్య ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.