కాగజ్‌నగర్‌ లో 250 వందల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

  • రేషన్ బియ్యం, రెండు ఐచర్ వ్యాన్లు సీజ్, ఇద్దరు నిందితులపై 6ఎ కింద కేసు నమోదు.

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో యధేచ్చగా రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు సిర్పూర్ (టి) వాంకిడి బార్డర్ మీదుగా అక్రమంగా రవాణ అవుతునే ఉన్నాయి. పట్టుబడ్డ PDS బియ్యం సీజ్ చేయడం MLAS పాయింట్ కు తరలించడం రెవిన్యూ అధికారుల వంతైంది, వాహనాలు సీజ్ చేయడం, బియ్యం అక్రమార్కులపై రెవిన్యూ అధికారులు 6ఏ కింద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడంతో , రేషన్ బియ్యం దందా యధేచ్చగా కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ లో 250 క్వింటాళ్ల ప్రభుత్వ రాయితి రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద ఓ పాత గుడిసెలో నిలువగా ఉంచిన బియ్యాన్ని అధికారులు పట్టుకొని, బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు ఐచర్ వ్యాన్ సీజ్ చేసి రాజేశం, అప్జల్ అనే ఇద్దరిపై 6ఎ కింద కేసు నమోదు చేసిన రెవిన్యూ అధికారులు.