కార్యకర్తలు కష్టపడితే విజయం మనదేఈసారి బీజేపీకి అనుకూలం -బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
- జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
- శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు కలగాలి..
బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటవుతుందని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవ్వడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో గంట రవికుమార్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిలుగా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్, క్లస్టర్ ఇంచార్జి మార్తినేని ధర్మారావు గార్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య పండితుడు డాక్టర్ కాలేశ్వరం సుమన్ శర్మ గారు పంచాగ శ్రవణం చేశారు. క్రోధి నామ సంవత్సరం ఆరంభాన్ని కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉగాది పచ్చడని ఆరగించారు. ఈ సంవత్సరం తమ రాశి ఫలాలు చూసుకున్నారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం సుమన్ శర్మ గారిని జ్ఞాపకతో గజమాలవేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కుసుమ సతీష్, డాక్టర్ కాళీ ప్రసాద్, ఎడ్ల అశోక్ రెడ్డి, మరియు రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మండల, డివిజన్ నాయకులు, బిజెపి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.