కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు- జిల్లాఎస్పీ రాజేంద్రప్రసాద్

జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలను లక్ష్యంగా చేసుకొని డిజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు దొంగలను మరియు అదే విధంగా క్రికెట్ బెట్టింగ్ లతో పాటు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడు తున్న కేసులో మరొకరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.జిల్లాకు చెందిన లెక్కల పూర్ణయ్య , కునిశెట్టి మూశలయ్య , గుంటూరు జిల్లాకు చెందిన బనావత్ కృష్ణ నాయక్లు ఏపీ 26 ఎక్స్ 7659 నంబర్ గల లారీకి ఓ వైపున 1 హెచ్పీ మోటారు ప్రత్యేకంగా బిగించుకొని లారీలో రెండు ట్యాంకర్ లను ఏర్పాటు చేసుకొని డిజిల్ దొంగతనానికి పాల్పడు తుండగా ఖమ్మం క్రాస్ రోడ్డులో పట్టుకునట్లు తెలిపారు. నిందితుల నుండి 1500 లీటర్ల డిజిల్ రికవరీ చేసినట్లు తెలిపారు.

అదే విధంగా మరో కేసులో ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న సూర్యాపేటకు చెందిన బొంత ఉదయ్ క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి బంగారం నగదును దొంగతనానికి పాల్పడుండగా పట్టుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా నిందితుడి నుండి 4 కేసులలో 3.35 లక్షల నగదు, 5 తులాల బంగారం స్వాధీనం చేసుకు న్నట్లు పేర్కొన్నారు . ఈ సమావేశంలో డీఎస్పీ నాగ భూషణం,సీఐలు శ్రీనివాస్,రాజశేఖర్,ఎస్ఐలు శ్రీనివాస్, క్రాంతి,యాకూబ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.