డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ స్ఫూర్తి అజరామరం-నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ స్ఫూర్తి అజరమారమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయం నందు, పట్టణంలోని మెయిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్ఎంపి అసోసియేషన్, ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అంబెడ్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన జరుగుతుంది అని ఆయన అన్నారు.
తెలంగాణా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ భారత దేశానికే ఒక రోల్ మోడల్ గా
నిలిచిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య యోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్య ఫలాలను అనుభవించేందుకు తోడ్పడిన గొప్ప భక్తులందరి స్మారక దినోత్సవంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు. స్వాతంత్య్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింసా, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత పౌరుల విశ్వమానవతత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు.భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్ఫూర్తిని ఆది నుంచి ప్రదర్శిస్తోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో. బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, ఆర్.ఎం.పి డాక్టర్లు, ఆటో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు….