తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాష్టంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాష్టంగా చేపట్టిన. కంటి వెలుగు కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లో ప్రారంభించిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ..ఎమ్మెల్సీ సురభి వాణి. కార్పొరేటర్ దేదీప్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు…

ప్రతి బస్తి లో కంటి వెలుగు శిబిరాలు అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు కల్లాద్దాలు మందులు పంపిణీ అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు..
రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మందికి కళ్ళద్దాల పంపిణీ చేస్తున్నట్లు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు..ఎస్బిహెచ్ఓ అనురాధ డాక్టర్ హర్షిత డాక్టర్ స్ఫూర్టీ.. జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రమేష్. ఇతర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందత్వాని నిర్ములించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని కంటివేలుగు పథకాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అని గోశామహల్ బిఆరెస్ నేత నందు కిషోర్ వ్యాస్ బిలాల్ పేర్కొన్నారు.హైద్రాబాద్, గోశామహల్ నియోజకవర్గంలోని గోశామహల్,మంగలహాట్,బేగంబజార్ ప్రాంతాలల్లో 7కంటివేలుగు పరీక్ష కేంద్రాలను నందుబిలాల్, మాజికార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, బిఆరెస్ నేతలు,ప్రభుత్వ అధికారులతో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బిఆరెస్ రాష్ట్ర నాయకులు నంద్ కిషోర్ వ్యాస్ మాట్లాడుతూ… నిరుపేదల సంక్షేమమే ధేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని,అందులో భాగంగా కంటివేలుగు పథకం తీసుకొచ్చారని తెలిపారు.వందరోజుల పాటు కొనసాగే ఈ కంటివేలుగు కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి,మందులు,కంటి అద్దాలు,అవసరమైతే ఆపరేషన్ కూడా చేహిస్తారని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని ఈ కంటివేలుగు పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నందు బిలాల్ కోరారు.
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.ఆల్విన్ కాలనీ డివిజన్లోని జన్మభూమి కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ , స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గంలోని 13 సెంటర్లను ప్రారంభించామని అన్నారు. అనంతరం పలువురికి కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న ఖమ్మం సభలో ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చూసి పలువురు ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారని, ఇలాంటి పథకాలు తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 100 రోజుల్లో 80 లక్షల రాష్ట్రవ్యాప్తంగా అయిన వారికి కంటి చెకప్ చేసి అందజేయనున్నట్టు తెలియజేశారు.
‘కంటి వెలుగు’తో అంధత్వం నివారిద్ధాం : MLA ప్రకాష్ గౌడ్ ఈ రోజు రాజేంద్రనగర్ సర్కిల్లోని మహిళా భవన్లో రెండో విడత “కంటి వెలుగు” కార్యక్రమాన్ని RDO శ్రీమతి చంద్రకళ,DC జగన్ గారితో కలిసి ప్రారంభించిన MLA ప్రకాష్ గౌడ్ గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా ప్రజా ప్రతినిధులు,అధికారులు బాధ్యత తీసుకోవాలి._

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని ఎమ్మెల్యే గారు అన్నారు.

కంటి వెలుగు నిర్వహించేందుకు మన వార్డులో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలి.

ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా ,అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని ఎమ్మెల్యే గారు తెలిపారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కార్పొరేటర్ శ్రీమతి అర్చన జయప్రకాష్ గారు,డివిజన్ అధ్యక్షుడు ధర్మ రెడ్డి,మహేష్, స్థానిక ప్రజాప్రతినిధులు,డాక్టర్లు,వైద్య సిబ్బంది బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ డా హరీష్ ,dhmo శ్రీనివాస్, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యా ,డిప్యూటీ మేయర్ శ్రీనివాస్,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం మండల్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. మంత్రులు చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, పౌరులందరికీ ఐ స్క్రీనింగ్ చేస్తారు అని , చూపు లోపాలను సరిదిద్దడానికి అవసరమైన అన్ని కేసులను ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తారనీ ,ఇతర కంటి సమస్యల అన్ని సేవలు ఉచితంగా అందిస్తారని , అవసరం ఉన్నవారికి మందులు ఇస్తారు అని , తీవ్రమైన కంటి వ్యాధుల నివారణపై పౌరులకు అవగాహన కల్పిస్తారు అని తెలిపారు ,18సo పైబడి ఉన్న ప్రతిఒక్కరు కంటి వెలుగు ప్రయోజనాలు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు ,కో ఆప్షన్ సభ్యులు ,అధికారులు , నాయకులూ తదితరులు పాల్గొన్నారు .
Kanti Velugu program at *LIC PARK MEHDIPATNAM NAMPALLY Constituency along with NAMPALLY MLA JAFFAR HUSSAIN MERAJ.Also seen are MEHDIPATNAM Corporator MAJEED HUSSAIN GHMC & Medical Department Offical’s..
C Sanjay AMC Director. Murlidhar valimiki ashok majeed iqbal pavan Raj Reddy at lic Park kanti velugu
అమీర్పేట్ లోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.